epass scholarship | TG విద్యార్థులకు శుభవార్త! 2025-26 విద్యా సంవత్సరానికి ఈ-పాస్ స్కాలర్‌షిప్ కు దరఖాస్తులు ప్రారంభం.

By Madhu

Published On:

Follow Us
epass scholarship

epass scholarship: తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, డిప్లొమా చదువుకునే విద్యార్థులకు ఇది శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల శ్రేయస్సు కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోంది.  ఇప్పుడు 2025-26 విద్యాసంవత్సరంలో చదువుకునే విద్యార్థులకు epass scholarship దరఖాస్తుల స్వీకరణకు సంబంధించిన ప్రక్రియ 1 జూలై 2025 నుండి ప్రారంభమైంది. ప్రభుత్వ పథకాల ద్వారా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థుల విద్యను కొనసాగించేందుకు ప్రభుత్వ అనేక చర్యలు చేపడుతోంది.

అందులో ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ మరియు దివ్యాంగ విద్యార్థుల కోసం ప్రతి సంవత్సరం పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ (Post Matric Scholarship – PMS) కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ పథకం కింద ఈ-పాస్ (Electronic Payment & Application System of Scholarships) వెబ్‌సైట్ ద్వారా స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తులను తీసుకుంటున్నారు.

epass scholarship 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన నూతనంగా దరఖాస్తు చేసుకునేవారు మరియు రెన్యూవల్ చేయవలసిన స్కాలర్‌షిప్ లకు దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. విద్యార్థులు ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోవాలి.

ముఖ్యమైన తేదీలు

ప్రారంభ తేది: 1 జూలై 2025

చివరి తేది: 30 సెప్టెంబర్ 2025

2025-26 అకాడమీ సంవత్సరానికి కళాశాలల్లో మరియు పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు కొత్తగా (తాజా) మరియు రెన్యూవల్ (పునరుద్ధరణ) స్కాలర్‌షిప్ కు దరఖాస్తులను ఈ-పాస్ వెబ్‌సైట్ ద్వారా సమర్పించాల్సి ఉంటుంది.

అర్హత కలిగిన విద్యార్థులు:

ఈ స్కాలర్‌షిప్ కోసం ఈ క్రింది వర్గాల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు:

  • ఎస్సీ (Scheduled Castes)
  • ఎస్టీ (Scheduled Tribes)
  • బీసీ (Backward Classes)
  • ఈబీసీ (Economically Backward Classes)
  • మైనారిటీలు (Muslims, Christians, Sikhs, Jains, Buddhists, etc.)
  • దివ్యాంగులు (Students with Disabilities)
  • దివ్యాంగులు (Physically Challenged)

 అర్హత ప్రమాణాలు

  1. విద్యార్థి గుర్తింపు పొందిన ప్రభుత్వ/ప్రైవేట్ కళాశాలలో చదువుతూ ఉండాలి.
  2. కనీసం 75% హాజరు ఉండాలి.
  3. పునరుద్ధరణ స్కాలర్షిప్ కోసం గత సంవత్సరం ఉత్తీర్ణత అవసరం.
  4. విద్యార్థి కుటుంబ వార్షిక ఆదాయం ఈ క్రింద పేర్కొన్న మించరాదు: SC/ST విద్యార్థులు: రూ. 2 లక్షలు లోపు, BC/EBC/Minority విద్యార్థులు: గ్రామీణ ప్రాంతం: రూ. 1.5 లక్షలు లోపు, పట్టణ ప్రాంతం: రూ. 2 లక్షలు లోపు

అవసరమైన డాక్యుమెంట్లు

దరఖాస్తు చేసేటప్పుడు ఈ క్రింది పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలి:

  1. ఆధార్ కార్డు
  2. ఆదాయ ధ్రువీకరణ పత్రం (MeeSeva ద్వారా పొందినది)
  3. కుల ధ్రువీకరణ పత్రం
  4. విద్యాసంబంధిత పత్రాలు (Pass Certificates, Bonafide Certificate)
  5. బ్యాంక్ ఖాతా వివరాలు (ఆధార్‌తో లింక్ అయి ఉండాలి)
  6. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో
  7. దివ్యాంగులైనవారికి మెడికల్ సర్టిఫికేట్
  8. హాస్టల్ నివాస ధృవీకరణ పత్రం (అవసరమైతే)

దరఖాస్తు చేయాల్సిన వెబ్‌సైట్:

విద్యార్థులు తమ స్కాలర్‌షిప్ దరఖాస్తులను ఈ అధికారిక వెబ్‌సైట్ ద్వారా సమర్పించాలి:
👉 https://telanganaepass.cgg.gov.in

epass scholarshipకి దరఖాస్తు విధానం

ఫ్రెష్ దరఖాస్తుదారుల కోసం:

👉 ఈ-పాస్ వెబ్‌సైట్‌కి వెళ్ళి “Post Matric Scholarship – Fresh” లింక్ క్లిక్ చేయాలి.

👉 ఆధార్ ఆధారంగా ప్రాథమిక నమోదు చేయాలి.

👉 అవసరమైన వివరాలను ఫిల్ చేయాలి.

👉 పత్రాలు అప్‌లోడ్ చేయాలి.

👉 Submit చేసిన తర్వాత acknowledgment తీసుకోవాలి.

👉 కళాశాల అధికారుల ద్వారా దృవీకరించించాలి.

రెన్యూవల్ దరఖాస్తుదారుల కోసం:

👉 రెన్యువల్ చేయాల్సిన విద్యార్థులు ఈ-పాస్ వెబ్ సైట్ లోకి వెళ్లి “Post Matric Scholarship – Renewal” లింక్ క్లిక్ చేయాలి.

👉 గత సంవత్సరం స్కాలర్‌షిప్ ID ఉపయోగించి లాగిన్ అవ్వాలి.

👉 తాజా విద్యా వివరాలు నమోదు చేసి పత్రాలు అప్‌లోడ్ చేయాలి.

👉 దరఖాస్తును Submit చేసి acknowledgment తీసుకోవాలి.

విటిని కూడా చదవండి
🚀ఇంటెలిజెన్స్ బ్యూరోలో 3,717 ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుగులో
🚀 తెలంగాణ 12 BC బీసీ స్టడీ సర్కిల్‌లో గ్రూప్స్ RRB, SSC, బ్యాంకింగ్ పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్..
🚀 మీ దగ్గర క్రెడిట్ కార్డ్ ఉందా అయితే ఈ తప్పులు మాత్రం అస్సలు చేయకండి !!
🚀 ఆడపిల్లల భవిష్యత్తు కోసం ఉత్తమ పెట్టుబడిలు!!!
🚀 తెలంగాణలోని మహిళలకు గుడ్ న్యూస్ | స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే అర్హులైన మహిళల అకౌంటులోకి ₹2,500?
🚀 ఉద్యోగ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ముఖ్య సూచనలు:

  • విద్యార్థులు తప్పనిసరిగా కాలేజీలో హాజరు శాతం 75% ఉన్న వారే దరఖాస్తు చేయాలి.
  • ఆదాయ పరిమితి:
    • SC/ST విద్యార్థులకు కుటుంబ వార్షిక ఆదాయం రూ. 2 లక్షలు లోపు
    • BC/EBC/Minority విద్యార్థులకు గ్రామీణ ప్రాంతాల్లో రూ. 1.5 లక్షలు, పట్టణాల్లో రూ. 2 లక్షలు లోపు
  • ఒకే విద్యా సంవత్సరం కోసం రెండు సార్లు స్కాలర్షిప్ దరఖాస్తు చేసుకోవద్దు.

ఈ-పాస్ స్కాలర్‌షిప్ ద్వారా లభించే ప్రయోజనాలు

ఈ స్కాలర్‌షిప్ ద్వారా విద్యార్థులకు అందే ముఖ్యమైన ప్రయోజనాలు ఇవే:

👉 ట్యూషన్ ఫీజు రీయింబర్స్‌మెంట్ (TF): విద్యార్థులు చెల్లించే ఫీజు మొత్తాన్ని ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది.

👉 మెయింటెనెన్స్ అలవెన్స్ (MTF): హాస్టల్ లేదా డే స్కాలర్స్‌కు నిత్య ఖర్చుల కోసం నెలవారీ అలవెన్స్ అందుతుంది.

👉 ఆర్థిక ఒత్తిడిని తగ్గించి విద్యాభ్యాసానికి ప్రోత్సాహం కలుగుతుంది.

👉 పేద కుటుంబాల పిల్లలకు అధిక విద్యను చేరుకునే అవకాశాలు పెరుగుతాయి.

సహాయ సమాచారం

ఈ-పాస్ సంబంధిత సమాచారం కోసం మీ జిల్లా District Welfare Officer (DWO) ని సంప్రదించవచ్చు. అలాగే, మీ కాలేజీలోని Scholarshipకు అధికారి అయినటువంటి Nodal Officer నుండి కూడా సహాయాన్ని పొందవచ్చు.

2025-26 విద్యా సంవత్సరానికి అర్హత ఉన్న ప్రతి విద్యార్థి తప్పకుండా గడువు లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క విద్యార్థి వినియోగించుకోని స్కాలర్‌షిప్ ను పొందగలరు.

📢 వెబ్‌సైట్ లింక్ మళ్లీ: telanganaepass.cgg.gov.in

Leave a Comment

Times Of Telugu: Your trusted news platform that delivers the latest and most reliable updates across various categories including Automobiles, Business, Technology, Finance, Entertainment, Education, and Sports!

Follow Us On Social Media

Get Latest Update On Social Media

About UsContact UsDisclaimerPrivacy PolicyTerms & ConditionsDMCA