హాయ్ ఫ్రెండ్స్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో (IB) ఉద్యోగం పొందాలి అనుకునే అభ్యర్థులకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ACIO Recruitment 2025 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) లో అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ACIO (Assistant Central Intelligence Officer) పోస్టుల భర్తీకి సంబంధించి 3,717 ఖాళీల గాను కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ రంగంలో మంచి ఉన్నతమైన హోదా కలిగిన ఉద్యోగం కోరుకునే అభ్యర్థులకు ఇది ఓ గొప్ప అవకాశంగా చెప్పవచ్చు.
ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) లో అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (ACIO) పోస్టుల దరఖాస్తుకు సంబంధించిన ముఖ్యమైన తేదీలు, అర్హతలు, జీతం మరియు ఏ విధంగా అప్లై చేయాలి, ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి, దరఖాస్తు కు సంబంధించినటువంటి అన్ని వివరాలను తెలుసుకుందాం.
IB ACIO Recruitment 2025 ముఖ్యాంశాలు
ఇంటెలిజెన్స్ బ్యూరోలో అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ACIO(Assistant Central Intelligence Officer) పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ www.mha.gov.in లో జూలై 19,2025 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లై చేసే టువంటి అభ్యర్థులు ఎవరైనా చివరి తేదీ వరకు వేచి ఉండకుండా చివరి తేదీ కంటే ముందే దరఖాస్తు చేసుకోగలరు.
| అంశం | వివరాలు |
| శాఖ | ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) |
| పోస్టులు | ACIO (Assistant Central Intelligence Officer) |
| ఖాళీలు | 3,717 |
| దరఖాస్తు ప్రారంభం | 19 జూలై 2025 |
| చివరి తేదీ | త్వరలో ప్రకటించబడుతుంది |
| అధికారిక వెబ్సైట్ | www.mha.gov.in |
| ఎంపిక విధానం | రాత పరీక్ష, డిస్క్రిప్టివ్ టెస్ట్, ఇంటర్వ్యూ |
| వయస్సు పరిమితి | 18 – 27 సంవత్సరాలు |
| విద్యార్హత | ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత |
ACIO Recruitment 2025 Eligibility
ACIO (Assistant Central Intelligence Officer) ఉద్యోగాలకు అప్లై చేయడానికి అభ్యర్థులు ఎవరైనా సరే ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ పాసై ఉండాలి.
విద్యార్హత:
- అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టులకు Candidates దరఖాస్తు చేయడానికి గుర్తింపు పొందిన యూనివర్సిటీ డిగ్రీ పాసైన వారు అర్హులు.
- కంప్యూటర్ నోలెడ్జ్ ఉన్నవారికి అదనపు ప్రాధాన్యం ఉంటుంది.
వయస్సు:
- కనీసం 18 సంవత్సరాలు, గరిష్ఠంగా 27 సంవత్సరాలు ఉండాలి.
- రిజర్వ్డ్ కేటగిరీలకు వయస్సులో సడలింపులు వర్తిస్తాయి.
ACIO Recruitment 2025 Selection Process
అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఉద్యోగాలకు అభ్యర్థులను ప్రధానంగా క్రింది మూడు దశలలో ఎంపిక చేశారు.
👉 Objective Type Written Test:
ఈ పరీక్ష అనేది బహుళ ఎంపిక ప్రశ్నల రూపంలో ఉంటుంది. ఇందులో సాధారణ జ్ఞానం, తార్కిక విశ్లేషణ, గణిత శాస్త్రం మరియు ఇంగ్లీష్ భాషపై అభ్యర్థి పరిజ్ఞానాన్ని పరీక్షిస్తారు.
👉Descriptive Test (Essay & English Comprehension):
ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు డిస్క్రిప్టివ్ పరీక్షకు అర్హులవుతారు. ఇందులో: ,నిబంధిత అంశంపై వ్యాసం రాయడం, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ మరియు ప్రిసిస్ రైటింగ్ ఉంటుంది.
👉 Interview:
డిస్క్రిప్టివ్ టెస్ట్‌లో అర్హత పొందిన అభ్యర్థులను చివరి దశ అయిన ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇందులో అభ్యర్థుల వ్యక్తిత్వం, కమ్యూనికేషన్ నైపుణ్యం మరియు వ్యవహార బుద్ధిని అంచనా వేస్తారు.
ఈ మూడు దశల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులే తుది జాబితాలో స్థానం పొందగలుగుతారు.
జీతం (Salary)
- ఈ పోస్టులకు లెవల్ 7 పే స్కేల్ (₹44,900 – ₹1,42,400) వర్తిస్తుంది.
- అదనంగా HRA, DA, TA వంటి ఇతర భత్యాలు కూడా ఉంటాయి.
- ప్రామాణిక ప్రభుత్వ ఉద్యోగ భద్రత, పెన్షన్ ప్రయోజనాలు కూడా అందుబాటులో ఉంటాయి.
How to Apply for ACIO Recruitment 2025
- అధికారిక వెబ్సైట్ www.mha.gov.inకి వెళ్ళండి.
- “Recruitment” సెక్షన్లో ACIO Recruitment 2025 నోటిఫికేషన్‌పై క్లిక్ చేయండి.
- రిజిస్ట్రేషన్ చేయండి.
- అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేసి, అప్లికేషన్ ఫీజు చెల్లించండి.
- అప్లికేషన్‌ను సమర్పించి acknowledgment పొందండి.
📎 అవసరమైన డాక్యుమెంట్లు:
- విద్యార్హత సర్టిఫికెట్లు
- ఫోటో & సిగ్నేచర్
- కేటగిరీ సర్టిఫికెట్ (SC/ST/OBC/రిజర్వ్డ్ అభ్యర్థులకు)
- ఐడెంటిటీ ప్రూఫ్ (AADHAR/PAN/Voter ID)
అధికారిక వెబ్సైట్:
👉 https://www.mha.gov.in .ఈ లింక్ ద్వారా అభ్యర్థులు 2025 జూలై 19 నుండి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది హోం మంత్రిత్వ శాఖ (Ministry of Home Affairs) అధికారిక వెబ్సైట్.
తరచూ అడిగే ప్రశ్నలు (FAQs)
1. ఏ శాఖ ఈ ఉద్యోగాలను నిర్వహిస్తోంది?
ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) – హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది.
2. అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఎప్పటి నుండి ప్రారంభమవుతాయి?
జూలై 19 నుండి ప్రారంభమవుతాయి
3. ACIO పోస్టుల భర్తీకి ఎన్ని ఖాళీలు ఉన్నాయి?
3717 ఖాళీలు ఉన్నాయి.
4. Assistant Central Intelligence Officer పోస్టులకు గాను ఎన్ని దశలో ఎంపిక చేస్తారు?
ఆబ్జెక్టివ్ టైప్ ప్రిలిమినరీ ఎగ్జామ్, డిస్క్రిప్టివ్ టెస్ట్, ఇంటర్వ్యూ
5. ఉద్యోగానికి ఎంపిక అయిన తర్వాత ట్రైనింగ్ ఎక్కడ జరుగుతుంది?
ముఖ్యంగా IB ట్రైనింగ్ అకాడమీలో స్పెషల్ ట్రైనింగ్ ఇస్తారు.
6. మహిళలు కూడా ఈ పోస్టులకు అప్లై చేయవచ్చా?
అవును, మహిళలు కూడా సమానంగా అర్హులు.
ముగింపు
ఇంటెలిజెన్స్ బ్యూరో ACIO పోస్టులు ప్రభుత్వ రంగంలో అత్యంత గౌరవనీయమైన, సవాళ్లతో కూడిన ఉద్యోగాలలో ఒకటి. దేశానికి సేవ చేయాలనే భావన ఉన్న యువత కోసం ఇది సుదర్బమైన అవకాశంగా చెప్పొచ్చు. మీరు అర్హులైతే, జూలై 19, 2025 నుంచి అధికారికంగా దరఖాస్తు చేయండి. చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే అప్లై చేయడం ఉత్తమం.
👉 మరిన్ని ప్రభుత్వ ఉద్యోగల సమాచారం, మరిన్ని తాజా వార్తల కోసం కోసం మా బ్లాగ్‌ను ఫాలో అవ్వండి.


